Header Banner

విజయవాడలో కలకలం! అనుమానాస్పదంగా.. 15 మంది అరెస్ట్!

  Fri May 23, 2025 13:41        Others

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విజయవాడ సమీపంలో ఎన్ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్, పోలీస్ విభాగాలు సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. పెనమలూరు మండలంలోని కానూరు, తాడిగడప, యనమలకుదురు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ తనిఖీల్లో బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన సుమారు 15 మంది యువకులు పట్టుబడ్డారు. వారిలో కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరంతా దేశంలో అనుమతులు లేకుండా నివసిస్తున్నారని గుర్తించి, విచారణ కోసం విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత, అక్రమ వలసదారులపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉండగా, విజయనగరంలో ఉగ్రవాద సంబంధాలపై మరో కీలక ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులతో సంబంధాలున్న ఆరోపణలతో ఇద్దరు యువకులను హైదరాబాద్ నుంచి వచ్చిన దర్యాప్తు బృందాలు అరెస్టు చేశాయి. బాబా మెట్ట సమీపంలో సిరాజ్ ఉర్ రెహ్మాన్ అనే యువకుడిని పట్టుకుని, అతడి ఇంట్లో పేలుడు పదార్థాలకు ఉపయోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే సయ్యద్ సమీర్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి తీసుకున్నారు. సిరాజ్ పేలుడు పదార్థాల తయారీపై ఇంటర్నెట్‌లో Search చేసినట్లు గుర్తించగా, అతడి బ్యాంక్ ఖాతాలో రూ.42 లక్షలు ఉండటంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఈ కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి: అప్పుల గొప్పలు.. జగన్ తిప్పలు! మంత్రి సంచలన వ్యాఖ్యలు

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారంవెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Vijayawada #BreakingNews #SecurityAlert #NIA #IllegalImmigrants